- Advertisement -
న్యూ ఇయర్ వేడుకలకు గోవాకు వెళ్లిన ఏపీ యువకుడిని కర్రలతో కొట్టి చంపింది రెస్టారెంట్ మాఫియా. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. నూతన సంవత్సర వేడుకల కోసం తాడేపల్లిగూడెం నుండి గోవా వెళ్లారు ఎనిమిది మంది స్నేహితుల బృందం.
డిసెంబర్ 29 ఆదివారం అర్ధరాత్రి గోవాలో రెస్టారెంట్‌కు వెళ్లారు యువతీ, యువకులు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఫుడ్ ఆర్డర్ విషయంలో టూరిస్ట్‌లకు గోవా బీచ్‌లోని ఓ రెస్టారెంట్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది.
రేట్ల గురించి ప్రశ్నించిన యువకులపై దాడి చేశారు రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ రవితేజ అనే యువకుడు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read:జాక్..రిలీజ్ డేట్
- Advertisement -