ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

210
ramesh
- Advertisement -

ఏపీ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజైంది.విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్… ఎన్నికలు సకాలంలో నిర్వహించడం కమిషన్‌ విధి అని, సుప్రీం కోర్టులో నిర్ణయం వస్తే తప్పకుండా పాటిస్తామని స్పష్టం చేశారు.

నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నామని తెలిపిన రమేశ్‌ కుమార్…రెవెన్యూ డివిజన్‌ ప్రతిపాదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తొలి దశలో విజయనగరం, ప్రకాశం జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో ఎన్నికలు ఉంటాయని పేర్కొన్నారు.

ఈ నెల 25నుంచి 27వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్ల స్వీకరించనున్నారు. 28న నామినేషన్ల పరిశీలన, 29 నామినేషన్లపై వచ్చిన అభ్యంతరాల పరిశీలన, 30న ఈ అభ్యంతరాలపై తుది నిర్ణయం, 31న నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు (మధ్యాహ్నం 3 గంటల వరకు). అదే రోజు పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 5న ఉదయం 6.30 నుంచి మధ్యాహ్నం 3.30 పోలింగ్‌ జరుగనుంది. అదేరోజు సాయంత్రం 4 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ జరగనుండగా అనంతరం ఫలితాలను వెల్లడించనున్నారు.

- Advertisement -