మరో సర్వే.. ఏపీలో అధికారం ఆ పార్టీదే !

20
- Advertisement -

ఏపీలో రోజుకో సర్వే తెరపైకి వస్తోంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనుండడంతో అధికారం ఎవరిదనే దానిపై సర్వేల కోలాహలం మొదలైంది. ఇప్పటికే చాలా సర్వేలు రాష్ట్ర రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. కొన్ని సర్వేలు టీడీపీ జనసేన కూటమికి అధికారం కట్టబెడితే మరికొన్ని సర్వేలు వైసీపీకి పట్టం కడుతున్నాయి. ఇక తాజాగా మరో సర్వే తెరపైకి వచ్చింది. టైమ్స్ ఆల్జీబ్రా అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర ఫలితాలు తెరపైకి వచ్చాయి. 1,50,000 శాంపిల్స్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సొంతం చేసుకొని మరోసారి అధికారం సాధిస్తుందని ఈ సర్వే  వెల్లడించింది. ఇక టీడీపీ జనసేన కూటమి 50 సీట్లకు పరిమితం అవుతుందని ఈ సర్వే అంచనా వేసింది. బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు ఏపీలో ఖాతా కూడా తెరిచే అవకాశం లేదని టైమ్స్ ఆల్జీబ్రా సంస్థ సర్వేలో వెల్లడించింది.

దీనితో పాటు జీ న్యూస్ మాట్రిక్స్ నిర్వహించిన సర్వేలో కూడా వైసీపీదే అధికారం అని తేల్చి  చెప్పింది. 175 సీట్లకు గాను వైసీపీ 133 సీట్లు సొంతం చేసుకొని అధికారంలోకి వస్తుందని, టీడీపీ జనసేన కూటమికి 44 శాతం లోపే ఓట్లు పోల్ అవుతాయని జీ న్యూస్ మ్యాట్రిక్స్ సర్వేలో చెప్పుకొచ్చింది. ఇక లోక్ సభ స్థానాల్లో కూడా వైసీపీనే ఆధిపత్యం కొనసాగిస్తుందని 25 ఎంపీ స్థానాలకు గాను 19 చోట్ల వైసీపీ నే విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే వెల్లడించింది. ఇకపోతే ఆ మద్య ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని అంచనా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బయటకు వస్తున్న సర్వేలు వైసీపీకే ఎక్కువ అనుకూల ఫలితాలు ఇస్తుండడంతో ఏపీ ప్రజలనాడీని సర్వేలు కూడా అంచనా వేయలేకపోతున్నాయా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆద్యంతం ఆసక్తి రేపుతున్న ఏపీ ఎన్నికల్లో చివరికి ఏ పార్టీ అధికారం సాధిస్తుందో చూడాలి.

- Advertisement -