ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టే ఏపీ రాజకీయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదే అంశాన్ని ప్రధాన అస్త్రంగా ఎంచుకున్న టీడీపీ పదేపదే ప్రస్తావిస్తూ సీఎం జగన్‌పై విమర్శలు చేస్తోంది. ఇక టీడీపీ విమర్శలకు గట్టిగా బదులిస్తున్నారు వైసీపీ నేతలు. సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినప్పుడు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశంసిస్తూ మాట్లాడిన వీడియోలు, వివిధ పత్రికలు మద్దతిచ్చిన క్లిప్పింగ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నాడు – నేడు అంటూ టీడీపీ నేతల తీరును ఎండగడుతున్నారు.
చంద్రబాబు కోసం అవసరమైతే రామాయణం..ఇతిహాసాలు… బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి కూడా ఆ మీడియా వెనుకాడదని ప్రూవ్ అయ్యింది.ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్…అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు… అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు…ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు..
ఆయన మీడియా సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు చెప్పుకొచ్చారు… ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో ఆ మీడియా ముందుంది. దాన్ని భూతంలా చూపిస్తూ పేజీలు పేజీలు నింపేస్తూ…ఆ ఛానల్లో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు… ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు ఆ మీడియా అధినేతకు సిగ్గులేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు
ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు… ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు… ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ…ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు… జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది.
Also Read:ఏపీ డీజీపీగా హరీశ్ గుప్తా