పోలీసులు రాజకీయాలు చేయవద్దు:అనిత

8
- Advertisement -

ప్రతీకార రాజకీయాలు చేయాల్సిన అవసరం తనకు లేదన్నారు ఏపీ హోమంత్రి అనిత.రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదని, సరిగ్గా పనిచేయని అధికారులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన అనిత.. తాము ప్రతీకారం తీర్చుకోవాలంటే ఎంతోమందిని అరెస్టు చేయవచ్చని తెలిపారు.

పోలీసులు రాజకీయాలు చేయవద్దని….ఖాకీ చొక్కాలు వేసుకున్న వాళ్లు రాజకీయాలు చేయాలంటే ఖద్దరు చొక్కా వేసుకోవాలని చెప్పారు. ఏపీకి పోలీస్ అకాడమీ, గ్రే హౌండ్స్ అకాడమీ లేదని అనిత చెప్పారు. వాటి కోసం కేంద్ర సర్కారు నిధులు పంపినప్పటికీ వాటిని వినియోగించలేదని తెలిపారు.

గత ఐదేళ్లుగా కానిస్టేబుల్, హోమ్ గార్డుల నియామకాలు లేవని …చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పని చేయట్లేదని తెలిపారు. మహిళల అదృశ్య కేసులు పెరిగాయని చెప్పారు.

Also Read:ఆవాల నూనెతో ప్రయోజనాలు!

- Advertisement -