ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో పోలీసులకు పూర్తి వసతులు కల్పించకపోయినా.. నేరాలను కట్టడి చేసేందుకు అష్టకష్టాలు పడ్డారని తెలిపారు హోంమంత్రి అనిత.శాసన మండలిలో శాంతిభద్రతలపై వాడీవేడి చర్చ జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారా ఘటనలను రాజకీయం చేయొద్దని అన్నారు.
గతంలో పోలిస్తే.. తమ ప్రభుత్వం హయాంలో క్రైమ్ రేటు తగ్గిందని తెలిపారు. 2023లో జనవరి – అక్టోబర్ మధ్య కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 22,418 నేరాలు జరిగాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రైమ్ తగ్గి ఇప్పటి వరకు 14,650 కేసులు మాత్రమే నమోదయ్యాయని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఐదేళ్ల పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిందని ఆరోపించారు.
జగన్ తల్లికి, చెల్లికి అన్యాయం జరిగినా.. తమ ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని అనిత స్పష్టం చేశారు. దిశ చట్టం సరిగా పని చేసి ఉంటే మహిళలపై దారుణాలు ఎందుకు జరిగేవని ప్రశ్నించారు.
Also Read:AA: పుష్ప అంటే వైల్డ్ ఫైర్