పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు..

46

రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన సేవలందించడానికి పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు రాయదుర్గం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ కాపు రామచంద్ర రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం మొట్టమొదటిసారిగా పశువులు సంత ఏర్పాటు చేశారు. ప్రభుత్వ విప్ కాపు రాంచంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పశువుల సంత లాంఛనంగా ప్రారంభించారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశువుల సంతలో రైతులు వ్యాపారులు ప్రజలు పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి గురువారం మార్కెట్ యార్డ్ లో పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు క్రయవిక్రయాలు జరుగుతాయని తెలిపారు. రైతు అంటే నమ్మకమని పాడి పశువుల వల్ల లాభదాయకంగా ఉంటుందని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి మంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు పేరుపై నూతన జిల్లా ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పేరుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి నూతన జిల్లా ఏర్పాటు చేయడం అన్ని పార్టీలు వర్గాలపై గౌరవ భావం పెంపొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉష, మార్కెట్ యార్డు కార్యదర్శి కే సునీత , రాయదుర్గం మున్సిపల్ చైర్ పర్సన్ శిల్ప హాజరై సీఎం వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.