- Advertisement -
ఏపీలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈరోజు మంత్రి పేర్ని నాని మీడియా సమావేంలో మాట్లాడుతూ, పారితోషికాలు కాకుండా వంద కోట్ల బడ్జెట్ దాటిన చిత్రాలు టికెట్ రేట్లు పెంచుకోవడంపై దరఖాస్తు చేసుకుంటే కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం కూడా ఏపీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిపైనే ప్రభుత్వం తాజా ఈ నిర్ణయం వెలువరించింది.
‘ఆర్ఆర్ఆర్’ భారీ బడ్జెట్ చిత్రమని, విడుదలైన తర్వాత కొన్నిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని ఇటీవల చిత్ర బృందం సీఎం జగన్ను కలిసి విజ్ఞప్తి చేశారు. దీనిపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ ఈ నెల 25న విడుదల కానుంది.
- Advertisement -