వరద నష్టంపై ఏపీ సర్కార్ రిపోర్టు రెడీ!

6
- Advertisement -

వరదలతో రాష్ట్రంలో 20 మంది మృతి చెందారని తెలిపింది ఏపీ ప్రభుత్వం. 1,69,370 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లిందని.. వరదలతో 22 సబ్ స్టేషన్​లు దెబ్బతినగా, 3,312 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించింది. 78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడగా, వరదల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 6,44,536 మంది నష్టపోయారని ప్రభుత్వం తెలిపింది.

78 చెరువులకు, కాలువలకు గండ్లు ఏర్పడ్డాయని వెల్లడించారు అధికారులు. 193 రిలీప్ క్యాంపుల్లో 42,707 మంది ఆశ్రయం పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు 50 ఎన్​డీఆర్​ఎఫ్, ఎస్​డీఆర్​ఎఫ్ టీంలు రంగంలో దిగాయాని, ఆరు హెలికాఫ్టర్లు పనిచేస్తున్నట్లు వెల్లడించారు.

వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. బాధితులకు ఏ రూపంలోనైనా సాయం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు.

Also Read:Rains:ఏ హీరో ఎంత ఇచ్చాడో తెలుసా?

- Advertisement -