Pushpa 2: ఏపీ ప్రభుత్వానికి బన్నీ థ్యాంక్స్

1
- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వస్తున్న పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరల పెంపునకు అనుమతిస్తూ జీవో చేసింది.

ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు అల్లు అర్జున్‌. ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేస్తుంది… ప్రత్యేకించి ఏపీ సీఎం చంద్రబాబుకు, సినీ ఇండస్ట్రీని బలోపేతం చేయడంలో సహకారం అందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు బన్నీ.

Also Read:PV Sindhu:పీవీ సింధు పెళ్లి తేదీ ఫిక్స్!

 

- Advertisement -