తెలంగాణలో ఏపీకి కేటాయించిన సచివాలయ భవనాల అప్పగింత పూరైయింది. ఇరు రాష్ట్రాల అధికారుల సమక్షంలో పత్రాల మార్పిడి చేసుకున్నారు. స్నేహపూర్వక వాతావరణంలో భవనాల అప్పగించిన నేపథ్యంలో ఆనందం వ్యక్తం చేసిన ఇరు రాష్ట్రాల ఉద్యోగులు. ఇలాంటి స్నేహపూర్వక బంధాన్ని కొనసాగించేలా మెదలాలి అని స్వీట్స్ పంచుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పలువురు తెలంగాణ,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు స్పందించారు.
చిట్టి రాణి రాష్ట్ర ప్రభుత్వ జీఎడి ఉద్యోగిని.. ఈ రోజు ఏపీ భవనాలను నార్త్ హెచ్,కె బ్లాక్ లను స్నేహపూర్వక వాతావరణంలో మనకు అందించడం జరిగింది. ఏపీ అధికారులకు ధన్యవాదాలు. భవిష్యత్‌లో ఇలాంటి బంధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్న దీనికి సహకరించిన ఏపీ ఉద్యోగులకు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున ధన్యవాదాలు తెలిపారు.
రవి ఏపీ జీఎడి ఉద్యోగి.. ఈరోజు శుభ దినం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి భవనాలను ఏపీ రాష్ట్రానికి కేటాయింపు జరిగింది. ఏపీకి కేటాయించిన భవనాలను ,కొత్త సీఎం వచ్చాక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒప్పందం మేరకు గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వంకు అప్పగించడం జరిగింది. ఇవ్వాళ తెలంగాణ అధికారులకు అధికారికంగా భవనాలను అందించాం. స్నేహపూర్వక వాతావరణంలో ఇవ్వడం జరిగింది. ఇలాంటి స్నేహపూర్వక బంధం ఇలానే కొనసాగుతోంది.అన్నారు.