దసరా సెలవులు..విద్యార్థులకు గుడ్‌న్యూస్‌

10
- Advertisement -

దసరా వేళ ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది ప్రభుత్వం. ఉపాధ్యాయుల కోరిక మేరకు మరో రెండు రోజులు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేశ్‌.

అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్‌ 2 వరకు దసరా సెలవులు ఉండగా తాజాగా మార్పు చేయడంతో ఏపీలో మరో రెండు రోజులు అదనంగా సెలవులు రానున్నాయి.

టీడీపీ గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీలు సెలవుల పొడిగింపు విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు లోకేశ్. వారి కోరిక మేరకు విద్యాశాఖ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Also Read:కాంతార 1..ట్రైలర్ డేట్ ఫిక్స్!

- Advertisement -