ఏపీ ఉచిత విద్యుత్ స్కీమ్..డేట్ ఫిక్స్!

7
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత విద్యుత్ స్కీమ్ తేదీ ఖరారైంది. ఆగస్టు 7 నుండి ఉచిత విద్యుత్తు పథకం అమలు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. పవర్‌లూమ్స్‌కు 500 యూనిట్లు, హ్యాండ్‌లూమ్స్‌కు 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించారు.

వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో భాగంగా ఈ మేరకు ప్రకటించారు చంద్రబాబు. అనంతరం ప్రజావేదికలో జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు, బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు సింగపూర్ వెళ్లినట్లు తెలిపారు.

రాష్ట్రంలో ఏడాదికి 64 లక్షల మందికి పింఛన్ల ద్వారా రూ.33,000 కోట్ల వ్యయం జరుగుతోందని వెల్లడించారు.గండికోట ప్రాజెక్టును ఎన్టీఆర్ ప్రారంభించగా, తానే పూర్తి చేశానని తెలిపారు. హంద్రీ-నీవా ప్రాజెక్టును వేగంగా పూర్తిచేయడం జరిగినదని, గాలేరు-నగరి ప్రాజెక్టును కడప వరకు పొడిగిస్తామని చెప్పారు. పాదాభివందనం చేశారు.

Also Read:WCL:పీసీబీ సంచలన నిర్ణయం

- Advertisement -