ఏపీలో ఫ్రీ బస్..స్త్రీ శక్తి పేరుతో టికెట్స్!

10
- Advertisement -

కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత బస్సు పథకాన్ని ఆగస్టు 15 నుండి అమలు చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఈ పథకానికి ‘స్త్రీ శక్తి’ అనే పేరు పెట్టగా ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. టికెట్ల రూపకల్పన, సాఫ్ట్‌వేర్‌లో మార్పులు, ఉద్యోగులకు శిక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ టికెట్లు ఉచిత ప్రయాణానికి సంబంధించినవని స్పష్టంగా తెలియజేస్తూ వాటిని జీరో ఫేర్ టికెట్ అనే పేరు మీద జారీ చేయనున్నారు. టికెట్‌పై ప్రయాణ ఛార్జీలు, ప్రభుత్వ రాయితీ వివరాలు తదితర సమాచారం స్పష్టంగా ఉంటాయి. దీని ద్వారా ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి స్పష్టత కలుగుతుందని చెబుతున్నారు.

టికెట్ల జారీ వేగంగా జరగాలన్న ఉద్దేశంతో, టికెట్ ఇష్యూ మిషన్లు (TIMS), యుటీఎస్ సాఫ్ట్‌వేర్‌లో అవసరమైన మార్పులు ఇప్పటికే పూర్తయ్యాయి.మహిళలు బస్సులో ఎక్కిన వెంటనే టికెట్ పొందేలా వ్యవస్థను సాంకేతికంగా మెరుగుపరిచారు.

Also Read:KPHB ఎకరం భూమి @రూ.65.34 కోట్లు

 

- Advertisement -