అటవీ శాఖలో ఉద్యోగాలు..జీతం ఎంతో తెలుసా?

7
- Advertisement -

ఏపీలో అటవీ శాఖ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 100 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ విడుదలకాగా ఆగస్టు 17వ తేదీలోపు అధికారిక వెబ్ సైట్ https://portal-psc.ap.gov.in/Default నుంచి అప్లై చేసుకోవచ్చు.

అభ్యర్థులు.. వృక్షశాస్త్రం/ఫారెస్ట్/హార్టీ కల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ/మ్యాథ్స్, స్టాటిస్టిక్స్/జియాలజీ/అగ్రికల్చర్ ఒక సబ్జెక్ట్ గా డిగ్రీ పాసై ఉండాలి.

అభ్యర్థులు కచ్చితంగా 163 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి, చాతీ 84 Cms ఉండాలి.. గాలి పీల్చినప్పుడు 5 Cms పెరగాలి. మహిళా అభ్యర్థుల ఎత్తు 150 Cms ఉండాలి. చాతీ చుట్టుకొలత 79 Cms తగ్గకుండా గాలి పీలిచినప్పుడు ఐదు సెంటీమీటర్లు పెరగాలి.

Also Read:KPHB ఎకరం భూమి @రూ.65.34 కోట్లు

అభ్యర్థుల వయసు 01.07.2025 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 32,670 నుంచి రూ.1,01,970 వరకు జీతం ఇస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ టెస్ట్. కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు కోసం రూ. 250, పరీక్ష ఫీజు రూ. 80 చెల్లించాల్సి ఉంటంది. అధికారిక వెబ్ సైట్ https://psc.ap.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

- Advertisement -