జగన్ ఒంటరి పోరు.. అసలు కారణం అదే!

13
jagan
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ముక్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. తెనాలిలో నిర్వహించిన రైతు భరోసా- పి‌ఎం కిసాన్ మూడో విడత నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సి‌ఎం జగన్ చేసిన వ్యాఖ్యలు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తున్నాయి. తాము ఏ పార్టీతో కలిసే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి గెలుపొందుతామని.. సి‌ఎం జగన్ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము ఉందా అంటూ సవాల్ కూడా సవాల్ కూడా విసిరారు. దీంతో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం రేగుతోంది. వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను వైసీపీ నేతలు సమర్థిస్తుంటే.. టీడీపీ వాళ్ళు కౌంటర్లతో విరుచుకుపడుతున్నారు. .

వైసీపీతో ఏ పార్టీ కలవదని, జగన్ అరచకవాది, నియంత వైకరి కాబట్టే ఏ పార్టీ కూడా ఆయనతో కలవడానికి ఇష్టపడదని ఎద్దేవా చేశారు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. అయితే వైసీపీతో కలవడానికి నిజంగానే ఏ పార్టీ ముందుకు రావడం లేదా ? జగన్ కావాలనే ఒంటరి పోరుకు సిద్దమౌతున్నారా ? అనేది మొదటి నుంచి ఆసక్తికరమైన చర్చగానే ఉంది. ఆ మద్య ప్రధాని మోడీ ఏపీలో పర్యటించినప్పుడు కూడా తాము ఏ పార్టీతో కలవబోమని, ఎన్నికలకు ఒంటరిగానే వెళతామని చెప్పుకొచ్చారు వైఎస్ జగన్. అయితే ఏపీలో బలమైన పార్టీ గా ఉన్న వైసీపీతో కలవడానికి మొదట బీజేపీ వంటి పార్టీలు ఆసక్తి చూపినప్పటికి.. ఆ తరువాత ఆ ఆలోచన విరమించుకొని జనసేనతో జట్టు కట్టింది. ఇక ఏపీలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ కూడా వైసీపీతో కలిసి నడుస్తుందనే వార్తలు వినిపించినప్పటికి అలా జరగట్లేదు.

ఇక పార్టీ పిరాయింపులకు పాల్పడే నేతలు కూడా వైసీపీ వైపు చూడడం లేదట. అందుకు ఇటీవల జరిగిన కన్నా ఎపిషోడే ఉదాహరణ. కన్నా లక్ష్మినారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పిన తరువాత వైసీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కన్నా లక్ష్మినారాయణ కు మద్య మంచి సన్నిహిత్యం ఉంది. అయినప్పటికి ఆయన వైసీపీని కాదని టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇక వైసీపీలోని కొందరు సిట్టింగ్ ఎమ్మేల్యేలు కూడా పార్టీకి దూరమయ్యేందుకు చూస్తున్నారని టాక్. ఈ పరినమలన్నీ గమనిస్తే.. కేవలం వైఎస్ జగన్ వైకరి వల్లే వైసీపీతో కలిసి నడిచేందుకు ఏ పార్టీలు ముందుకు రావడం లేదనేది కొందరి అభిప్రాయం. అందుకే వైఎస్ జగన్ కూడా తాను ఒంటరిగానే పోటీ చేస్తానని చెప్పడంలో ఆయన కాన్ఫిడెన్స్ ను పక్కన పెడితే.. ఆయనతో కలిసి నడవడానికి ఏ పార్టీలు కూడా ముందుకు రాకపోవడంతోనే వైసీపీకి ఒంటరిపోరు తప్పడం లేదనేది టీడీపీ జనసేన నుంచి వినిపిస్తున్న విమర్శ. మొత్తానికి వైఎస్ జగన్ ఒంటరిపోరుపై రకరకాల కామెంట్స్ వినిపించడం ఇప్పుడు పోలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -