Jagan:రెడీ అయిన అధినేతలు!

23
- Advertisement -

ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే అన్నీ పార్టీలకు సంబంధించి సీట్ల కేటాయింపులు కూడా జరిగిపోవడంతో ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తించే పనిలో ఉన్నారు అధినేతలు. ఈ నేపథ్యంలో వైసీపీ తరుపున జగన్మోహన్ రెడ్డి, టీడీపీ తరుపున చంద్రబాబు నాయుడు, జనసేన తరుపున పవన్.. ఇలా అధినేతలంతా ప్రజల్లోకి వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈ నెల 27 ( రేపటి నుంచి ) వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టబోతున్నారు. ఇప్పటికే సిద్దం సభలతో పోలిటికల్ హీట్ పెంచిన జగన్.. ఇక బస్సు యాత్రతో మరోసారి ప్రచారంలో తన మార్క్ చూపించే ప్లాన్ లో ఉన్నారు. మేమంతా సిద్దం పేరుతో జరిగే ఈ బస్సు యాత్రను రేపు ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రారంభించి 21 రోజుల పాటు రాష్ట్రంలోని అని నియోజకవర్గాలు పర్యటించేలా షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. .

అటు టీడీపీ కూడా రేపటి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రజాగళం పేరుతో నిర్వహించే ఈ యాత్రలో బహిరంగ సభలు, రోడ్ షోలకు అధిక ప్రదాన్యత ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది, అటు పవన్ కూడా రేపటి నుంచే వారాహి యాత్రను మళ్ళీ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా మూడు పార్టీల అధినేతలు రేపటి నుంచే ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ప్రచారంలో భాగంగా అధినేతలు ప్రకటించే హామీలు, ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ఆరోపణలతో పోలిటికల్ హీట్ ఫిక్స్ చేరనుంది. ఇప్పటివరకు అడపా దడపా బహిరంగ సభలు మాత్రమే నిర్వహిస్తు వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. ఇకపై నేరుగా ప్రజల్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రచారం ఎలా సాగనుందనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతున్న అంశం. మరి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తూ ప్రజా మద్దతును ఎవరు కూడగట్టుంటారో చూడాలి.

Also Read:IPL 2024 :డీకే.. లాస్ట్ ఐపీఎల్?

- Advertisement -