29న కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌

21
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 29న కొండగట్టులో పర్యటించనున్నారు. కొండగట్ట ఆంజనేయస్వామిని దర్శించుకోనున్న పవన్…ప్రత్యేక పూజలు చేయనున్నారు. ప్రస్తుతం పవన్ 11 రోజుల వారాహి దీక్షలో ఉన్నారు.

ఈ దీక్షలో భాగంగా పవన్‌ కేవలం పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకోనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కొండగట్టుకు రావడం ఇదే తొలిసారి కాగా గతంలో అనేకసార్లు స్వామి వారిని దర్శించుకున్నారు.

తన ఎన్నికల ప్రచార రథమైన వారాహికి ఇక్కడే పూజలు చేయించారు. అనంతరం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

Also Read:లోక్ సభ స్పీకర్‌గా ఓంబిర్లా ఎన్నిక

- Advertisement -