ఏపీలో అభివృద్ధి జరగాలంటే సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేటలో బీఆర్‌ఎస్ జెండా పండుగా సందర్భంగా గులాబీ జెండాను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కేసీఆర్ నాయకత్వంతోనే సువర్ణ ఆంధ్రప్రదేశ్ సాకారమవుతుందన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న పథకాలను చూసి.. చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ఇది కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమన్నారు. రాయల తెలంగాణ అంశం వదిలి ఆంధ్ర ప్రజలు ఆ దిశగా ఆలోచించాలని సూచించారు. అక్కడి ప్రభుత్వాల వైఫల్యాలతోనే రాయల తెలంగాణ అంశం తెరమీదకు వచ్చిందన్నారు.
Also Read:IPL 2023 : ఎస్‌ఆర్‌హెచ్ కు.. వార్నర్ శాపం తాకిందా!
పాలకుల చిత్తశుద్దిలోపంతోనే రాయల తెలంగాణ డిమాండ్ తెరమీదకు వచ్చిందన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని ఆంధ్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, వెనుకబాటుకు కారణమైన పారిపాలకుల మీద ఆంధ్ర ప్రజలు తిరుగుబాటు చేయాలన్నారు.
Also Read:ఉరూరా గులాబీ జెండా పండుగ