సీఎం రేవంత్‌తో పవన్ భేటీ

9
- Advertisement -

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు పవన్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటి విరాళంకు సంబంధించిన చెక్‌ను రేవంత్‌కు అందించారు పవన్.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మరియు వరదల కారణంగా సంభవించిన విధ్వంసాన్ని చూసి చలించిపోయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.1 కోటి విరాళం అలాగే పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నందున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద ముంపు బారిన పడ్డ 400 పంచాయతీలకు.. ఒక్కో పంచాయతీకి రూ.1 లక్ష చొప్పున మొత్తం రూ.4 కోట్లు విరాళం ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేశారు. తాజాగా తెలంగాణ సీఎంను కలిసి చెక్కును అందజేశారు.

Also Read:లక్ష్మారెడ్డి సతీమణి మృతి.. హరీశ్‌ రావు నివాళి

- Advertisement -