ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా..

144
India Corona cases
- Advertisement -

ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 97వేల 696 శాంపుల్స్ ని పరీక్షించగా 3వేల 797 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 5వేల 498 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 35మంది కరోనాతో మృతి చెందారు.

తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 12,706 మంది కరోనాతో మృతి చెందగా ఏపీలో ఇప్పటిదాకా 18,89,513 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 18,38,469 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 38,338 యాక్టివ్ కేసులుండగా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 18,89,513కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 2,19,93,618 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

- Advertisement -