షర్మిల..పోస్టు కార్డుల ఉద్యమం

5
- Advertisement -

చంద్రబాబు సార్.. ఈ పోస్టు కార్డులు చూసైనా మహిళలకు ఫ్రీ బస్ ఇవ్వండి అని డిమాండ్ చేశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఆర్టీసీ బస్సులో మహిళలతో కలిసి పోస్టు కార్డుల ఉద్యమాన్ని ప్రారంభించారు. మూడు రోజుల పాటు ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది పోస్టు కార్డులను సీఎం చంద్రబాబుకు పంపిస్తామని తెలిపారు షర్మిల.

వీటిని చూసైనా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తారని భావిస్తున్నట్లు వెల్లడి చంద్రబాబు మీరు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిన ఉచిత బస్సు హామీ ఎందుకు నెరవేర్చట్లేదు అని ప్రశ్నించారు.

విజయవాడ బస్టాండ్ నుంచి తెనాలికి బస్సులో ప్రయాణించారు షర్మిల. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. టిక్కెట్ కొని ఉచిత ప్రయాణం ఎక్కడ అని ప్రశ్నించారు ఏపీసీసీ చీఫ్.

Also Read:Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

 

- Advertisement -