ఏపీలో కాంగ్రెస్ స్కెచ్ అదే?

41
- Advertisement -

ఏపీలో తిరిగి బలం పెంచుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నాట్లు తెలుస్తోంది. అందుకే గత కొన్ని రోజులుగా ఏపీపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. 2014 తరువాత ఏపీలో కాంగ్రెస్ పూర్తిగా కనుమరుగైపోయింది. ఆ పార్టీలోని చాలమంది నేతలు ఇతర పార్టీల గూటికి చేరారు. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ తరుపున చెప్పుకోదగ్గ నేతలు ఎవరు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజు కూడా ఆశించిన స్థాయిలో యాక్టివ్ గా లేరు. అందుకే నేరుగా అధిష్టానమే రంగంలోకి దిగే ప్లాన్ చేస్తోంది. వచ్చే నెలలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించనున్నారు. .

ఈ పర్యటనలో భాగంగా ఏపీలో పార్టీ స్థితిగతులపై బేరీజు బేరీజు వేసి పార్టీ బలోపేతం కోసం ఎలాంటి వ్యూహాలు సిద్దం చేసుకోవాలనే దానిపై రాహుల్ గాంధీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏపీలో సెన్సిటివ్ టాపిక్స్ అయిన ప్రత్యేక హోదా, విభజన హామీలనే ఎత్తుకొని కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఆయన చేసిన భారత్ జోడో యాత్రలో ఏపీకి సంబంధించి తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చారు.

Also Read:TTD:శోభాయమానంగా పుష్పపల్లకీ సేవ

అంతే కాకుండా విభజన టైమ్ లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇదే అంశాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీకి పూర్వ వైభవం తేవాలని హస్తం పార్టీ భావిస్తోంది. అయితే ఏపీలో కాంగ్రెస్ ను బలంగా ముందుకు నడిపించే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే ఒక బలమైన నేతకు ఏపీ కాంగ్రెస్ బాద్యతలు అప్పగించే యోచనలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే షర్మిలతో ఏపీ రాజకీయాల విషయంలో మంతనాలు కూడా జరుగుతున్నట్లు పోలిటికల్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏపీలో బలపడేందుకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ లు ఎంతవరుకు ఫలిస్తాయో చూడాలి.

Also Read:హైదరాబాద్‌లో ‘సెల్ఫిష్’

- Advertisement -