వీలైనంత తక్కువ భూసేకరతో, తక్కువ నష్టంతో గోదావరి జలాలతో కృష్ణా నదిని అనుసంధానం చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు, కె.చంద్రశేఖర్ రావు, వై.ఎస్.జగన్ లు నిర్ణయించారు. గోదావరి నీటిని కృష్ణాకు తరళించే విషయంతో పాటు రెండు రాష్రాగులకు సంబంధించిన పలు ఇతర అంశాల పై రెండు రాష్రా ోల ముఖ్యమంత్రులు సోమవారం ప్రగతి భవన్ లో సుదీర్ఝ చర్చ జరిపారు. గోదావరి నీటిని కృష్ణాకు ఎక్కడ నుండి, ఎలా తరళించాలి, అలైన్ మెంట్ ఎలా వుండాలి? అనే విషయాలు చర్చించారు.
ఉభయ రాష్ట్రాలకు ప్రయోజనకరంగా వుండే విధంగా జలాల తరలింపు, నీటి వినియోగం వుండాలని నిర్ణయించారు. దీనికోసం రెండు రాష్రాలాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యుత్, పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఇద్దరు సిఎంలు చర్చించారు.
తెలంగాణ రాష్రంంిలో 18వేల మంది పోలీసులను ఒకే సారి నియమిస్తున్నందున అందులో 4వేల మందికి ఆంధ్రప్రదేశ్ లో శిక్షణనివ్వాలని కేసిఆర్ ఏపి ముఖ్యమంత్రిని కోరారు. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారు. పోలీసులకు ఒకే సారి శిక్షణనివ్వడం వల్ల వారందరినీ ఒకేసారి విధుల్లోకి తీసుకునే వెసులుబాటు కలుగుతుంది. ఈ అంశాలతో పాటు రెండు రాష్రారిలకు సంబంధించిన ఇతర విషయాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు.