మళ్లీ వచ్చేది వైసీపీ సర్కారే అన్నారు సీఎం జగన్. నాయుడుపేటలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు. మన ప్రభుత్వంలో అవ్వా తాతల ఇంటికి వెళ్లి పెన్షన్ ఇచ్చే వాళ్లమని, అది తట్టుకోలేకపోయిన చంద్రబాబు తన మనుషులతో అడ్డుకున్నారని సీఎం జగన్ ఆరోపించారు.
ఈ ఎన్నికలు రెండు భావజాలాల మధ్య జరుగుతున్న సంఘర్షణ…. ఈ ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్న పోరాటం అన్నారు. ఏపీలో మరోసారి వచ్చేది వైసీపీ ప్రభుత్వమే….. వైసీపీ ప్రభుత్వం రాగానే తన తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే ఉంటుందన్నారు. టీ కుటిల కూటమిని తరిమికొట్టేందుకు అందరూ సిద్ధమయ్యారని చెప్పారు జగన్.
మళ్లీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్లీ సేవలు అందించే కార్యక్రమం ప్రారంభిస్తాను. ఇదే చంద్రబాబును అడుగుతున్నా. అయ్యా చంద్రబాబు మీ హయాంలో జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదా అన్నారు. పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సర్టిఫికెట్ కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచం ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ, ఏ ఒక్క పేదవాడికి అప్పట్లో అందే పరిస్థితి ఉండేది కాదు అన్నారు జగన్.
Also read:తెలంగాణలో సమైక్య సంక్షోభం!