ఆంధ్రప్రదేశ్‌ పట్ల సీఎం కేసీఆర్ ఔదార్యం:జగన్‌

666
ap cm jagan assembly
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ పట్ల సీఎం కేసీఆర్ ఔదార్యం ప్రదర్శిస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చ సందర్భంగా మాట్లాడిన జగన్‌….చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇంతటి దిక్కుమాలిన ప్రతిపక్షం ప్రపంచంలో ఎక్కడా ఉండదన్నారు.

తాను వెళ్ళినా,వెళ్లక పోయినా ప్రాజెక్టును ప్రారంభించి ఉండేవారని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉండాలన్నారు జగన్‌. కాళేశ్వరం పూర్తయ్యాకే నేనే వెళ్లానని చెప్పారు. ఏపీలో చంద్రబాబు అధికారం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రారంభమైందన్నారు. తన రాష్ట్రం నుంచి నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ ముందుకు వచ్చారని చెప్పారు. గోదావరి నీళ్లు సాగర్‌,శ్రీశైలంకు తరలిస్తే ఆయకట్టు స్థీరికరణ జరుగుతుందన్నారు.

తెలంగాణ నుంచి గోదావరి నీళ్లు ఇచ్చేందుకు కేసీఆర్ ఒప్పుకున్నారని చెప్పారు. కాళేశ్వరం కడుతుంటే చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు జగన్‌. ఇంత దురదృష్టకరమైన ప్రతిపక్షం ఏపీలో ఉండటం ప్రజలు చేసుకున్న పాపం అన్నారు. మనతో సత్సంబంధాలు కొనసాగిస్తుంటే అందరు సంతోషించాల్సింది పోయి దిక్కుమాలిన విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే ఆల్మట్టి కట్టారు…ఆల్మట్టి ఎత్తు పెంచారని చెప్పారు.

కేసీఆర్‌…ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఔదార్యం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయటం తగదన్నారు జగన్‌. ఏపీ ఇంతటి అధ్వాన్న పరిస్ధితుల్లో ఉండటానికి కారణం చంద్రబాబే కారణమన్నారు. 44 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నేత ఇలా అసత్య ప్రచారం చేయడం సరికాదన్నారు. గోదావరి జలాలు శ్రీశైలంకు వస్తే ఏపీతో పాటు తెలంగాణ సరిహద్దు జిల్లాలు బాగుపడుతాయన్నారు.

- Advertisement -