సీఎం కేసీఆర్, తెలంగాణ పోలీసులకు హాట్సాఫ్ః సీఎం జగన్

242
jagan-Salute kcr

దిశ హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై తెలంగాణ పోలీసులు, ముఖ్యమంత్రి కేసీఆర్ కు సెల్యూట్ చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘దిశ’ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలో దిశ బిల్లును ప్రవేశపెట్టారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఈ బిల్లుపై శాసన సభలో సుదీర్ఘ చర్చసాగింది. బిల్లు పాస్‌ అయినట్లు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ క్రిమినల్‌ లా చట్టం 2019, ఆంధ్రప్రదేశ్‌ స్పెషల్‌కోర్టు ఫర్‌ స్పెసిఫైడ్‌ అఫెన్సెస్‌ అగైనిస్ట్‌ విమెన్‌ అండ్‌ చిల్ట్రన్‌ యాక్ట్‌ 2019కి ఆమోద ముద్ర వేసింది. ఈ చట్టం ప్రకారం అత్యాచారానికి పాల్పడినట్లు నేరుం రుజువైతే దోషికి మరణశిక్ష విధిస్తారు.

tammineni

ఈసందర్భంగా సీఎం జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. మహిళలపై దాడి చేయాలన్న ఆలోచన వస్తే వణుకు పుట్టేలా చట్టం తీసుకొచ్చామని చెప్పారు. బాధితులకు త్వరితగతిన న్యాయం చేసేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే మరణ శిక్ష పడుతుందనే భయం రావాలని, అప్పుడే వ్యవస్థలో మార్పు వస్తుందని సీఎం జగన్‌ అన్నారు. వ్యవస్థలో మార్పుకోసమే విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇటువంటి నిర్ణయాలతోనే మార్పు వస్తుందన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు జరుగుతుందన్నారు. ఈ కోర్టుల్లో మహిళలు, పిల్లలపై జరిగే వేధింపులకు సంబంధించి కేసుల విచారణ మాత్రమే జరుగుతుందని వెల్లడించారు. డీఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఈ టీమ్ లుంటాయన్నారు. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టులు పెడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. 14 రోజుల్లో విచారణ పూర్తయ్యేలా చట్టం తీసుకొస్తున్నామన్నారు. మొత్తం 21 రోజుల్లో రేప్‌ కేసుపై జడ్జిమెంట్‌ వస్తుంది. ప్రస్తుతం ఉన్న 4 నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందించినట్లు తెలిపారు.