ఏపీ రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నువ్వా నేనా అన్నట్లుగా వైసీపీ, జనసేన, టీడీపీ పార్టీలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ప్రస్తుతం మూడు పార్టీలు కూడా గెలుపుపై కాన్ఫిడెంట్ గానే ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజానీకం తీర్పు ఎలా ఉండబోతుందనేదే ఇప్పుడు అందరి నోళ్లలో నానుతున్న ప్రధానమైన ప్రశ్న. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందనే విషయాన్ని తాజా ఎమ్మెల్సీ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శింకింది. దీన్ని బట్టి జగన్ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందనే భావన రాకమానదు. అయినప్పటికి వచ్చే ఎన్నికలపై వైసీపీ మాత్రం ఫుల్ కాన్ఫిడెంట్ గానే కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలను బట్టి పూర్తి ప్రజాభిప్రాయాన్ని అంచనా వేయలేమని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు.
అయితే ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల వల్ల వైసీపీలో ఎంతో కొంత కలవరం మొదలైందనేది పోలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న తాజా చర్చ. దాంతో వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలంటే ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను నిర్వీర్యం చేయడం ఒక్కటే మార్గమనే ఆలోచనలో సిఎం జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పదే పదే టీడీపీ జనసేన పొత్తును ప్రస్తావిస్తున్నారు. దమ్ముంటే తన లాగా 175 నియోజిక వర్గాల్లోనూ సింగిల్ గా పోటీ చేయాలని టీడీపీ, జనసేన పార్టీలకు సవాల్ విసురుతున్నారు. అయితే జగన్ సవాళ్లను టీడీపీ జనసేన పట్టించుకునే పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల మద్య పొత్తు దాదాపు ఖరారైంది. ఆ మద్య జనసేన ఆవిర్భావ సభలో టీడీపీతో పొత్తు ఉంటుందనే సంగతిని పవన్ చెప్పకనే చెప్పారు. ఈ రెండు పార్టీలు కలిస్తే వైసీపీకి భారీగానే నష్టం జరిగే అవకాశం ఉంది.
అసలే జగన్ సర్కార్ పై ప్రజావ్యతిరేకత బలంగా ఉన్న నేపథ్యంలో టీడీపీ జనసేన పార్టీలు కలిస్తే వైసీపీకి పట్టుమని 10 సీట్లు కూడా రావని వైసీపీ రెబెల్ నేతల నుంచి వినిపిస్తున్న మాట. అందుకే ఈ రెండు పార్టీల మద్య పొత్తును పదే పదే పాయింట్ ఔట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు వైసీపీ నేతలు. తాజాగా సిఎం జగన్ మరోసారి ఈ రెండు పార్టీల పొత్తు ను ప్రస్తావించారు.. తోడేళ్ళన్ని ఏకం అవుతాహున్నాయని.. ఎవరెన్ని చేసిన వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అని జగన్ చెబుతున్నారు. ఇక వైసీపీ శ్రేణులు కూడా తమ నాయకుడు సింహం మాదిరి సింగిల్ గా బరిలోకి దిగుతున్నారని, తోడేళ్ళ గుంపులు ఏకం అవుతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఈ సింహం తోడేళ్ళ కథలు ఎన్ని చెప్పిన అవన్నీ రాజకీయ వ్యూహమే అనేది అటు ప్రతిపక్షలకు, ఇటు ప్రజలు బాగా తెలుసు.
ఇవి కూడా చదవండి..