ఏపీలో రాజధాని అంశం గత కొన్నాళ్లుగా తీవ్ర చర్చనీయాంశం అవుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రస్తుతం రాజధానిగా ఉన్న అమరావతిని కాదని పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తీసుకొచ్చారు. అయితే మూడు రాజధానుల అమలుకి అమరావతి రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడడంతో హైకోర్టు జోక్యం చేసుకొని త్రీ క్యాపిటల్స్ ప్రతిపాదనను హోల్డ్ లో ఉంచింది. అయినప్పటికి ఎన్నికల కంటే ముందే మూడు రాజధానులను అమలు చేసి తీరుతామని జగన్ సర్కార్ గత కొన్నిరోజులుగా చెబుతూ వస్తోంది, .
అయితే త్రీ క్యాపిటల్స్ కు కేంద్రం మద్దతు లభించకపోవడం కోర్టు నుంచి కూడా ఎలాంటి అనుమతీరకపోవడం వంటి కారణాలతో అనూహ్యంగా విశాఖ రాజధాని అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. త్వరలో విశాఖ నుంచి పాలన సాగిస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి జగనే గతంలో చెప్పడంతో ఇంతకీ రాజధాని విషయంలో జగన్ వైఖరి ఏంటి అనేది ఎవరికి అంతుచిక్కడం లేదు. ఇక విశాఖలో సహజ వనరుల దోపిడి కోసమే రాజధానిగా ప్రకటించబోతున్నారని విమర్శలు రావడంతో ఆ ప్రాంత ప్రజలు కూడా దీనిపై సంతృప్తిగా లేరనేది రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట.
ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా రాజధాని అంశంపై ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు వైసీపీ నేతలు. అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చారట. దసరా రోజున విశాఖ రాజధానిగా పాలన ప్రారంభం కాబోతున్నట్లు కేబినెట్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారట సిఎం జగన్మోహన్ రెడ్డి. దీంతో మరోసారి ఏపీ రాజకీయాల్లో రాజధాని అంశం హాట్ టాపిక్ అయింది. అయితే మూడు రాజధానుల అంశం కోర్టులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి చిక్కులు ఉండకుండా కేవలం విశాఖను మాత్రమే రాజధానిగా ప్రక్సటించేందుకు జగన్ సర్కార్ సిద్దమౌతున్నట్లు త్లెఉస్తోంది. ఈ ప్రతిపాదనను అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తే అవకాశం ఉందా ? అందుకు సంబంధించి బిల్లు కూడా జగన్ సర్కార్ రెడీ చేసిందా అనేది చూడాలి.
Also Read:చైతు ఎఫైర్ పై ‘సమంత’కు ప్రశ్న