రేపటి తరం కోసమే విజన్ 2047: ఏపీ సీఎం

3
- Advertisement -

స్వర్ణాంధ్ర విజన్-2047 డాక్యుమెంట్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన చంద్రబాబు…రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అన్నారు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు కనిపిస్తాయి…2047లోనూ ఇదే పునరావృతం అవుతుందన్నారు.

జమిలి ఎన్నికల విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అన్నారు చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందన్నారు. వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు…రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందన్నారు.

Also Read:ప్రతిపక్ష పార్టీలకు అవకాశం ఇవ్వలేదు:ఎంపీ కిరణ్

- Advertisement -