చదువుల చుక్కాని..చుక్కా రామయ్య

6
- Advertisement -

వందవ ఏట అడుగు పెట్టారు విద్యావేత్త చుక్కా రామయ్య. 1925 నవంబర్ 20న జన్మించారు చుక్కా రామయ్య. ఈ సందర్భంగా ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

శత జన్మదినోత్సవం జరుపుకుంటున్న విద్యావేత్త చుక్కా రామయ్యకు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు ఏపీ సీఎం చంద్రబాబు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని చుక్కా రామయ్య నిరూపించారు అని కొనియాడారు.

తెలుగు నేలపై విద్యా వికాసానికి చుక్కాని వంటి మాస్టారు చుక్కా రామయ్య… నీతి నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిరూపమైన చుక్కా రామయ్య సంపూర్ణ ఆరోగ్య ఆనందాలతో మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను అని తెలిపారు చంద్రబాబు.

- Advertisement -