రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన:చంద్రబాబు

3
- Advertisement -

అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. “అసెంబ్లీలో నాకు జరిగిన అవమానానికి నేను కన్నీళ్లు పెట్టుకున్నా. 2019-24 మధ్య నా లాగే ఎన్నో మంది కన్నీళ్లు పెట్టుకున్నారు” అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆయన అన్నారు.

“నోటీసు ఇవ్వకుండా నన్ను అరెస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటనకు వెళ్తే అడ్డుకున్నారు. అప్పుడు మమ్మల్ని అడ్డుకున్న వాళ్లు ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అంటూ విమర్శించారు. గత ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించారు.

వైసీపీ చేసిన తప్పులను సరిచేయడానికే తమ ప్రభుత్వానికి ఏడాది పట్టిందని చంద్రబాబు తెలిపారు. “వైసీపీ చేసిన పాపాలను కడగడానికి సమయం పట్టింది. వ్యవస్థను సరిదిద్దడమే మా ప్రాధాన్యం” అన్నారు. రెవిన్యూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని, భూమి సమస్యలను పారదర్శకంగా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

బ్లాక్‌చైన్ టెక్నాలజీ వినియోగంతో ప్రతి వ్యక్తి భూమికి భద్రత కల్పిస్తామని, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. “ఒక వ్యక్తి చేసిన తప్పుడు పనుల వల్ల మొత్తం ప్రభుత్వం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా వ్యవస్థను బలోపేతం చేస్తాం” అని సీఎం స్పష్టం చేశారు.

Also Read:12 ఏళ్ల టీ20 రికార్డు బ్రేక్!

- Advertisement -