ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీశారు: చంద్రబాబు

0
- Advertisement -

ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేలా గత ప్రభుత్వం వ్యవహరించిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. వాస్తవాలు బయటకు రావాల్సి ఉందని, అన్ని తెలుసుకున్నాక తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చరిత్రలో ఏ నాయకుడూ చేయని తప్పులను గత ప్రభుత్వంలో సీఎం చేశారన్నారు. ఎవరు తప్పు చేసినా చర్యలు తీసుకుంటే.. మరొకరు అలాంటి తప్పు చేయకుండా ఉంటారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్‌ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. ‘వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో దీన్ని రూపొందించాం అని చెప్పారు.

తన అవినీతి ఖ్యాతిని జగన్‌ విశ్వవిఖ్యాతం చేసుకున్నారని TDP ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. రూ.60 వేల కోట్లు దోచుకొని జగన్‌ ఈడీ కేసుల్లో ఉన్నారన్నారు. అటువంటి వ్యక్తికి రూ.1,750 కోట్లు లంచం తీసుకోవడం ఓ లెక్కా అని ఎద్దేవా చేశారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలతో భారీగా దోచుకునేందుకు ప్రణాళిక చేశారని ఆరోపించారు.

Also Read:ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు…షర్మిల ఫైర్!

- Advertisement -