ఆలయాల్లో అన్యమతస్థులపై నిషేధం:చంద్రబాబు

5
- Advertisement -

ప్రార్థనా మందిరాలు, చర్చిలు, మసీదుల్లో ఆయా మతాలకు సంబంధించిన వారే పనిచేయాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మీడియాతో మాట్లాడిన ఏపీ సీఎం.. త్వరలో కొత్త చట్టం తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. అందరూ వాళ్ల సంప్రదాయాలను గౌరవించాలి… వాటి ప్రకారమే అక్కడకు వెళ్లిన వారు నడుచుకోవాలని, ఇందులో మరో ఆలోచన లేదు అని తేల్చిచెప్పారు.

స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తున్నా అన్నారు చంద్రబాబు. సూచనలు http://swarnadra.ap.gov.in ద్వారా ప్రజలు పంపవచ్చు అన్నారు. మీ సహకారానికి అభినందనలను ఇ-సర్టిఫికెట్ ద్వారా అందుకోవచ్చు అన్నారు.

2047 నాటికి మెరుగైన వృద్ధిరేటు సాధనే లక్ష్యం అని..స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ప్రయాణాన్ని ప్రారంభించామన్నారు. ప్రకాశవంతమైన ఏపీ రూపకల్పనకు పౌరులుగా మీ సూచనలు ఆహ్వానిస్తున్నాం..ప్రతి సూచనను పరిగణనలోకి తీసుకుంటూ సమష్టిగా స్వర్ణాంధ్ర నిర్మించుకుందాం అన్నారు చంద్రబాబు.

Also Read:పురాతన బావులు దత్తత తీసుకున్న పారిశ్రామికవేత్తలు 

- Advertisement -