ఇది ఉక్కుతో చెక్కబడిన ఒక చారిత్రాత్మక ఘట్టం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడంపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. వికసిత్ భారత్-వికసిత్ ఆంధ్రలో భాగంగా దేశ నిర్మాణానికి దోహదపడుతుందని ప్రధానికి హామీ ఇస్తున్నాను అన్నారు చంద్రబాబు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేవలం కర్మాగారం మాత్రమే కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల పోరాటాలు, స్ఫూర్తికి స్మారక చిహ్నం అన్నారు. త్వరలోనే ఏపీకి మంచి రోజులు రానున్నాయని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం అభినందనీయం అన్నారు బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి రూ.11,500 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీ, నిర్మలా సీతారామన్, కుమారస్వామికి ధన్యవాదాలు చెప్పారు. అమృతరావు, తెన్నేటి విశ్వనాథం కృషి, వేలాది మంది తెలుగువారి పోరాట ఫలితంగా 32 మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో విశాఖలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగిందన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు అన్నారు పురందేశ్వరి. ఎంతో మంది కృషి ఫలించి నేడు కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్లు ఆర్థిక ప్యాకేజీ అందించడం ఆనందంగా ఉందన్నారు. బీజేపీ ఎప్పుడూ ఇచ్చిన మాట ప్రకారం ఆర్థిక సాయం అందించడం విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో మరోసారి నిరూపించిందన్నారు.
Also Read:చాగంటికి అవమానం..ఖండించిన టీటీడీ