నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే పోతారు!

3
- Advertisement -

విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. నాయకుడిపై నమ్మకం ఉంటే ఉంటారు లేకపోతే ఎవరి దారి వాళ్లు చూసుకుంటారు అని చెప్పుకొచ్చారు. ఇది వైసీపీ వ్యక్తిగత విషయం అన్నారు.

రాజకీయ పార్టీలో ఇలాంటి పరిణమాలు జరుగుతుంటాయని.. ఏదేమైనా విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు అన్నారు. దీనిపై తాను కామెంట్‌ చేయనని …సాయిరెడ్డి రాజీనామా వైసీపీ పరిస్థితికి అద్దంపడుతుందని విమర్శించారు.

తాను రాజీనామా చేయడానికి ముందు జగన్‌తో అన్ని విషయాలను చర్చించానని తెలిపారు విజయసాయిరెడ్డి. పదవికి రాజీనామా చేయడం సరికాదని కూడా జగన్‌ సూచించారని చెప్పారు. కానీ పదవికి న్యాయం చేయలేకపోతున్నా కాబట్టే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

Also Read:ఉద్యోగాలు ఇచ్చే స్థితిలో ఉండాలి: చంద్రబాబు

- Advertisement -