పుష్కరాల కంటే ముందే పోలవరం పూర్తి!

4
- Advertisement -

2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయడం తమ ప్రభుత్వ బాధ్యత అని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం పూర్తయితే సాగునీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని, లక్షలాది ఎకరాలకు నీరు అందడంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలిపారు.

అదే విధంగా, రాబోయే మూడేళ్లలో అమరావతికి ఒక స్పష్టమైన, శాశ్వత రూపును తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో మరెక్కడా నిర్మించలేని విధంగా అత్యాధునిక మౌలిక వసతులతో, ప్రణాళికాబద్ధంగా అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధాని పనులను వేగవంతం చేసి, రోడ్లు, భవనాలు, పరిపాలనా కేంద్రాలు, ఐటీ హబ్‌లతో అమరావతిని రాష్ట్ర గర్వకారణంగా మార్చుతామని తెలిపారు.

అయితే గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మాజీ సీఎం ఇంటి పక్కన హెలీప్యాడ్ కోసం ఓ ప్రైవేట్ వ్యక్తి భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. భూమి ఇవ్వడానికి నిరాకరించాడని, కేసులు పెట్టి వేధించారని చెప్పారు. ఇలాంటి అన్యాయాలకు తమ పాలనలో చోటు ఉండదని, ప్రజల హక్కులను కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Also Read:రెండేళ్లలో రేవంత్ చేసింది శూన్యం:కేటీఆర్

 

- Advertisement -