ఏడాదిలోనే ఎన్నో మార్పులు తెచ్చాం:చంద్రబాబు

7
- Advertisement -

సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో ఏడాది పూర్తి చేసుకుంది అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రజల ఆకాంక్షలను తీర్చడం కోసం శక్తి వంచన లేకుండా ప్రతి రోజూ పని చేస్తున్నాం అన్నారు.

అనేక సమస్యలను, ఆర్థిక సవాళ్లను దాటుకుని ఏడాది కాలంలోనే ‘పేదల సేవలో’, ‘పెన్షన్లు, ‘అన్న క్యాంటిన్లు’, దీపం-2, ‘తల్లికి వందనం’, ‘మత్స్యకార సేవలో’…లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమల్లోకి తెచ్చాం అన్నారు. మెగా డిఎస్సీతో టీచర్ ఉద్యోగాలు…పెట్టుబడులతో ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనకు అడుగులు వేశాం అని తెలిపారు.

55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు సహా రైతు సంక్షేమానికి పలు నిర్ణయాలు తీసుకున్నాం. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చే కార్యక్రమం చేపట్టాం. రాజధాని నిర్మాణం, పోలవరం పనులను మళ్లీ గాడిన పెట్టాం. రైల్వే జోన్ సాధించాం. స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించాం. మీ ఆశీర్వాద బలంతో రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మాట ఇస్తున్నాను. ఏడాది పాలనను విజయవంతం చేయడానికి సహకరించిన, పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సుపరిపాలనలో తొలి అడుగు ప్రజల్లో నమ్మకాన్ని, భరోసాను కలిగించింది…మలి అడుగు మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అని చెప్పారు.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -