మెగా డీఎస్సీపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ గురించి కీలక ప్రకటన చేశారు.ఏప్రిల్ నెల తొలి వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
వేసవి సెలవులు ముగిసిన వెంటనే, స్కూల్స్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి టీచర్ల నియామక ప్రక్రియ పూర్తవుతుందని వెల్లడించారు. మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో జరిగిన సమావేశంలో, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, టీచర్ పోస్టుల భర్తీపై ప్రకటన చేశారు.
రాష్ట్రంలో త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసి,పెద్ద సంఖ్యలో టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీలో మాట్లాడిన ఆయన,రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
Also Read:ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్..