కక్ష సాధింపులకు వెళ్లకండి: చంద్రబాబు

5
- Advertisement -

కూటమి నేతలతో అవసరం తీరింది అనుకోవద్దు..2029లో మళ్లీ ఎన్నికలు వస్తాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పార్టీ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు…కూటమి పార్టీల ఎమ్మెల్యేలు ఉన్న 29 నియోజకవర్గాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

ఎవరిదారి వారే చూసుకుంటే ఎన్నికల సమయంలో ఇబ్బందులు తప్పవని…ఎమ్మెల్యేలు అందరూ సమన్వయంతో పని చేయాలని సూచించారు. గత పాలకులు చేసిన తప్పులే మనం చేస్తే రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందన్నారు.

వైసీపీ వాళ్లు చేయని తప్పు లేదు…తప్పు చేసిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లో వదలం అని తేల్చిచెప్పారు. కక్ష సాధింపు చర్యలకు పోతే మనకు వైసీపీ వాళ్లకు తేడా ఉండదన్నారు.

Also Read:Harishrao: మూసీకి బీఆర్ఎస్ వ్యతిరేకం కాదు

- Advertisement -