కేటీఆర్ ..ఈ పేరు వింటేనే టీడీపీ మంత్రులు వణికిపోతున్నారట..ఈ విషయం తెలిసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తలపట్టుకుంటున్నారు..ఇంతకీ ఏం జరుగుతోంది…చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే క్రమంలో కేసీఆర్..కేటీఆర్ ఎలాంటి వ్యూహం అనుసరిస్తున్నారనేది అర్థం కాక ఒక వైపు చంద్రబాబు తల బద్దలు కొట్టుకుంటుంటే…కేటీఆర్ విమర్శల్ని తిప్పికొట్టే వారు కూడా లేకపోవడం తో ఆయనలో మరింత టెన్షన్ పెరిగిపోతోంది.. దీనికి కారణం ఏపీ నేతలకు హైదరాబాద్ లో భారీగా ఆస్తులు ఉండటమే కారణం అని చెబుతున్నారు..ఒకవేళ కేటీఆర్ ను విమర్శిస్తే తమ ఆస్తులకు ఎలాంటి ముప్పు వాటిల్లుతుందో అని వారు భయపడుతున్నారట.
ఆల్రెడీ ఈ విషయంలో చంద్రబాబు ఒక అడుగు ముందుకు వేసి కేసీఆర్ మా నేతల్ని బెదిరిస్తున్నారంటూ ఆరోపణలకు దిగారు..కేటీఆర్ ఏం మాట్లాడినా చంద్రబాబు లేదా లోకేశ్ మాత్రమే కౌంటర్ ఇస్తున్నారు తప్ప మిగతా నేతలెవరూ నోరు మెదపకపోవడంతో చంద్రబాబు తల పట్టుకుంటున్నారు.. ఈ విషయమై ఏ పీ క్యాబినెట్ లో సైతం చర్చ జరిగినట్లు తెలుస్తోంది.. మీరెవరూ మాట్లాడకపోతే కేటీఆర్..కేసీఆర్.జగన్ లు మాట్లాడేవే ప్రజల్లో చర్చలో ఉంటాయి.. మనకు బాగా డామేజ్ జరుగుతుందని హెచ్చరించినట్లు సమాచారం.
ఎన్నికలకు ఎంతో సమయం లేకపోవడంతో బాబు మంత్రులకు ఎమ్మెల్యేలకు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం.. ఎప్పుడు ఎక్కడ ప్రభుత్వంపై విమర్శలు వచ్చినా తక్షణం ప్రత్యారోపణ చేయాలని సూచించారట..పాపం టీడీపీ మంత్రులు..నేతలు…ఆస్తుల మీద మమకారంతో నోరు మెదకపోవడమే కాకుండా కేటీఆర్ ను చూస్తేనే గడగడా వణికిపోతున్నారట.