ఏపీలో సినిమా టికెట్ల ధరల పెంపు..థాంక్యూ చెప్పిన చిరు

62
jagan
- Advertisement -

ఎట్టకేలకు ఏపీలో సినిమా టికెట్ ధరల పెంపు వివాదానికి పుల్ స్టాప్ పడింది. సినీ ఇండస్ట్రీ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ఏపీ సర్కార్..ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చిన్నసినిమాలకు ఐదో షోలు వేసుకునేందుకు అవకాశం ఇచ్చింది.

హీరో, డైరెక్టర్ పారితోషికం కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. కనీసం 10 రోజుల వరకు సినిమా టికెట్లపై రేట్లు పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.

ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌, మంత్రి పేర్నినాని, అధికారులు, కమిటీకి చిత్ర పరిశ్రమ తరుఫున చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. పాన్ ఇండియా స్టార్ కూడా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -