ఏపీ కేబినేట్ భేటి…కీలక నిర్ణయాలు

2
- Advertisement -

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుండగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సీఆర్డీఏ ఆధారిటీ స‌మావేశంలో ఆమోదం తెలిపిన రూ. 24,276 కోట్ల పనులకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలియజేయనుంది.

వివిధ ప‌రిశ్ర‌మ‌లకు భూ కేటాయింపుల‌కు కేబినెట్ ఆమోదించే అవ‌కాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదించిన అంశాలను మంత్రి వ‌ర్గంలో చ‌ర్చించనున్నారు. రాజధాని నిర్మాణంలో యువతను భాగస్వామ్యం చేయడంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. మంగ‌ళ‌గిరిలో ఉన్న ఎయిమ్స్ సంస్ధ‌కు మ‌రో ప‌ది ఎక‌రాలు భూ కేటాయింపు ప్రతిపాదనకు కూడా మంత్రి వ‌ర్గం ఆమోదం తెలిపే అవ‌కాశం ఉంది.

103 ఎకరాల్లో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణానికి అనుమ‌తులు ఇవ్వ‌నున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేనప్పుడు ప్రజలకు ప్రవేశం కల్పించి టవర్ పైనుంచి సిటీ మొత్తం చూసేలా అసెంబ్లీ భ‌వ‌నం నిర్మాణం చేయ‌నున్నారు.

Also Read:జమిలీ ఎన్నికలు..రాజ్యాంగంపై దాడినే!

- Advertisement -