- Advertisement -
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం పలికింది. ముఖ్యంగా సమీకృత పర్యాటక 2024-29 కి ఆమోదం తెలిపింది.
స్పోర్ట్స్ పాలసీలో మార్పులకు , సీఆర్‌డీఏ (CRDA) ఆమోదించిన 23 అంశాలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి అవాస్ యోజన పథకానికి, ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు ఓకే చెప్పింది. గత ఐదేళ్లలో నిర్మించని గృహాల రద్దుపై సమావేశం చర్చించింది.
ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్ట సవరణకు, ఏపీ టెక్ట్స్‌టైల్,ఏపీ మారిటం, డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు ఆత్మారణ దినోత్సవాన్ని జరుపడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
Also Read:నారా లోకేశ్ ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన
- Advertisement -