AP Cabinet:20న ఏపీ కేబినెట్ భేటీ

10
- Advertisement -

ఈ నెల 20న ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి చేసుకోబోతుంది. ఈ అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలపైనా కేబినెట్‌లో చర్చించి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగేలా ప్రత్యేక కార్యక్రమం తలపెట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.అలాగే జూన్ 12న అన్ని నియోజకవర్గాల కేంద్రాలలో ఆయా ఎమ్మెల్యేలతో భారీ కార్యక్రమం నిర్వహించే అంశంపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొత్త రేషన్ కార్డుల అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read:విశ్వక్‌ మూవీలో పుష్ప 2 నటుడు!

- Advertisement -