24న ఏపీ కేబినెట్‌ సమావేశం..

9
- Advertisement -

ఈ నెల 24న ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్‌తో పాటు మంత్రులంతా హాజరుకానున్నారు. 24న ఉదయం 10 గంటలకు సచివాలయంలో క్యాబినెట్‌ మీటింగ్‌ ఏర్పాటు చేశారు.

కేబినెట్‌ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ నెల 21, 22 వతేదీల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రొటెం స్పీకర్‌గా బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేసిన తర్వాత అసెంబ్లీకి ఎన్నికైన 175 మంది శాసన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Also Read:Harish:రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు

- Advertisement -