ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు, సంస్థలకు భూముల కేటాయింపుపై సీఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.
మొంథా సమయంలో క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు తక్షణ సాయం అందించారని అభినందనలు తెలిపారు చంద్రబాబు. మొంథా తుపాను సమయంలో బాగా పనిచేశారని ప్రశంసలు..ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు సాయం అందేలా చేశారు అని కితాబిచ్చారు.
గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికార యంత్రాంగం పూర్తి సమన్వయంతో పనిచేశారు..అందువల్లనే సహాయక చర్యలు వేగంగా అందాయి.. మంత్రులు, అధికారులు, యంత్రాంగం టీమ్ స్పిరిట్‍తో పనిచేస్తే ఇటువంటి మంచి ఫలితాలే వస్తాయంటూ సీఎం అభినందనలు చెప్పారు. మీరంతా ఎలా కష్టపడి పనిచేశారో స్వయంగా చూశానంటూ మంత్రులపై ప్రశంసలు గుప్పించారు.
Also Read:తెలంగాణ స్పీకర్‌పై ధిక్కరణ పిటిషన్

