ఏపీ కేబినెట్ నిర్ణయాలివే..

4
- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలకు అమోదం తెలిపారు. వివిధ ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు మంజూరుకు ఓకే చెప్పారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, అమరావతి విమనాశ్రయాలకు హడ్కో కింద నిధులపై చర్చ జరిగింది.

వెయ్యికోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ రుణానికి ఆమోదం, అలాగే చంద్రయ్య కుమారుడు వీరాంజనేయులుకు ప్రభుత్వ ఉద్యోగానికి అంగీకారం తెలిపింది కేబినెట్. హత్యకు గురైన తోట చంద్రయ్య కుమారుడికి ఉద్యోగానికి అంగీకారం తెలిపింది.

అలాగే ఏపీ జలజీవన్ నీటిసరఫరా కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం,ఏపీ మోటార్ వెహికల్ బిల్లులో పలు చట్టసవరణలు చేసింది. పరిశ్రమలు, కార్మిక బిల్లులో పలు చట్టసవరణలతో పాటు అమరావతి పరిధిలో క్వాంటం కంప్యూటింగ్‍కు ఆమోదం తెలిపింది. అమరావతి పరిధిలో భూమిలేని 1,575 పేద కుటుంబాలకు పింఛన్ కొనసాగింపుపై ,పెండింగ్‍లో ఉన్న పింఛన్ కొనసాగించేందుకు ఆమోదం తెలిపారు.

నక్కపల్లి ప్రాంతంలో ఏపీఐఐసీ పరిధిలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుపై చర్చ, ఏపీ స్పేస్ పాలసీ 2025-30 ఆమోదం,నెల్లూరు జిల్లాలో పెట్రో కెమికల్ పరిశ్రమ కోసం భూసేకరణ,కో రైతులను ఆదుకునేందుకు రూ14.88 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

Also Read:విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్

- Advertisement -