ఏపీ ఓటాన్ బడ్జెట్.. ప్రత్యేకతలివే !

27
- Advertisement -

మరి కొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగనుండడంతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం జరుతున్న అసెంబ్లీ సమావేశాల్లో తాజాగా ఓటాన్ బడ్జెట్ ప్రవేశ పెట్టింది. ఈ బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ ప్రవేశ పెట్టారు. ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో వరుసగా ఐదు సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన వ్యక్తి]గా బుగ్గన నిలిచారు. ఈ బడ్జెట్ లో 2024-25 సంవత్సరానికి గాను రూ.2,86,389.27 కోట్లు కేటాయించారు. ఇందులో ఆదాయ వ్యయం రూ.2,30,110.41 కోట్లుగా, మూలధన వ్యయం రూ.30,530.18 కోట్లు, రెవెన్యూ లోటు రూ.24.758.22 కోట్లు, ద్రవ్య లోటు రూ.55,817.50 కోట్లుగా పొందుపరిచారు. ఇక కేటాయింపుల విషయానికొస్తే..

*ఉచిత పంటల భీమా కోసం రూ.3411 కోట్లు
*జగనన్న విద్యా దీవెన రూ.11,901 కోట్లు
*సున్నా వడ్డీ రుణాలు రూ.1835 కోట్లు
*జగనన్న వసతి దీవెన రూ.4267 కోట్లు
*జగనన్న పాల వెల్లువ రూ.2697 కోట్లు
* జగనన్న తోడు రూ.3374 కోట్లు
*వాహన మిత్ర రూ.1305 కోట్లు
*కళ్యాణమస్తు, షాదీ తోఫా రూ. 350 కోట్లు
*వైఎస్ఆర్ భీమా రూ.650 కోట్లు
*నేతన్న హస్తం రూ.983 కోట్లు

జగన్ చాణిక్య పాలన సాగిస్తున్నారని, సుపరిపాలన, సామర్థ్య ఆంధ్ర, మన మహిళా మహారణుల ఆంధ్ర, అన్నపూర్ణ ఆంధ్ర, సంక్షేమ ఆంధ్ర, భూభద్ర ఆంధ్ర.. ఇలా ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు జరిపినట్లు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ చెప్పుకొచ్చారు.

Also Read:ఆ జిల్లాల్లో వైసీపీ.. పనైపోయిందా?

- Advertisement -