బీజేపీకి అగ్ని పరిక్షే..?

18
- Advertisement -

ఏపీలో జనసేన పార్టీ వ్యవహరిస్తున్న తీరు బీజేపీకి అగ్ని పరీక్షలా మరిందా అంటే అవుననే చెప్పక తప్పదు. ఎందుకంటే జనసేన పక్షాన ఏపీలో బలపడాలని చూసిన బీజేపీకి పవన్ ఇస్తున్న షాకులు ఆ పార్టీ వ్యూహాలను తలకిందులు చేస్తున్నాయి. ఏపీలో టీడీపీని దూరం పెడుతూ జనసేనతో మాత్రమే పొత్తు కొనసాగిస్తూ రాబోయే ఎన్నికల్లో సత్తాచాటలని చూసిన కమలనాథులకు అనూహ్యంగా టీడీపీతో పొత్తు ప్రకటించి కోలుకోలేని షాక్ ఇచ్చారు పవన్ కల్యాణ్. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. అయితే బీజేపీతో పొత్తును మొదటి నుంచి కూడా నామమాత్రంగానే కొనసాగిస్తూ వచ్చారు పవన్.

కానీ బీజేపీ మాత్రం సీరియస్ గా జనసేన దోస్తీని కోరుకుంది. సరిగ్గా ఎన్నికలకు ఎనిమిది నెలల సమయం ముందు అంచనాలన్నీ తారుమారు చేస్తూ జనసేన టీడీపీతో జట్టు కట్టింది. ఇప్పుడు బీజేపీ డెసిషన్ తీసుకోవాల్సిన టైమ్ వచ్చింది. ప్రస్తుతం పవన్ బీజేపీ ప్రస్తావన లేకుండా టీడీపీ జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాయని చెబుతున్నారు. దీంతో పరోక్షంగా తాను బీజేపీతో లేనని చెబుతున్నారా అనే అనుమానలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.

కానీ ఏపీ బీజేపీ నేతలు మాత్రం జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని.. చెప్తూ టీడీపీతో పొత్తు అంశాన్ని మాత్రం అధిష్టానమే చూసుకుంటుంది అనే దొరణీలో చెబుతున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జేవీల్ నరసింహారావు మాట్లాడుతూ పొత్తు అంశం ఫైనల్ డెసిషన్ పార్టీ పెద్దలదే అని స్పష్టం చేశారు దీంతో టీడీపీ జనసేన కూటమిలో చేరికపై తేల్చడం పార్టీ పెద్దలకు అగ్ని పరీక్షలా మారింది. ఎందుకంటే టీడీపీతో కలవకపోతే జనసేన దూరమయ్యే అవకాశం ఉంది. ఒకవేళ జనసేన అండ లేకుండా బరిలోకి దిగితే పార్టీకి డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి దీంతో ముందు గొయ్యి వెనుక నుయ్యి అన్నట్లుగా తయారారైంది కాషాయ పార్టీ పరిస్థితి.

Also Read:ఈ ఆసనాలతో వెన్ను సమస్యలకు చెక్ !

- Advertisement -